నరసరావుపేట పట్టణంలోని శ్రీ దత్త హాస్పిటల్ అరుదైన శస్త్ర చికిత్సలకు వేదికగా మారిందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో కూడా పలుమార్లు గుండెకు సంబంధించిన అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను విజయవంతం చేసి రోగుల ప్రాణాలు కాపాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ గర్భిణీ స్త్రీ కి క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి పండంటి మగబిడ్డకు జన్మను ప్రసాదించిన విషయం ఇప్పుడు జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే.... ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామానికి చెందిన టి సీతామహాలక్ష్మి అనే గర్భిణీ స్త్రీ డెలివరీ నిమిత్తం నరసరావుపేట పట్టణంలో పలు హాస్పిటల్ ను సంప్రదించగా ఆమెకు గుండెలో రంధ్రం ఏర్పడిందని ఇటువంటి క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ ను తాము చేయలేమని కార్డియాలజీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇది సాధ్యపడుతుందని తెలిపిన మీదట ఆమె నరసరావుపేట పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మృదుల ను సంప్రదించడం జరిగింది. ఇదే విషయాన్ని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ తో సంప్రదించారు.ఆయన గర్భిణీ స్త్రీ అయిన సీతామహాలక్ష్మీ కి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా ఆమె గుండెకు రంధ్రం పడినట్లు గుర్తించారు అంతేగాకుండా ఊపిరితిత్తులలో బీపీ బాగా ఉందని గమనించారు.వ్యాధి నిర్ధారణ అనంతరం మందుల ద్వారా మెరుగుపరిచి సిజేరియన్ ఆపరేషన్ కు సిద్ధం చేశారు.శ్రీదత్త హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ పర్యవేక్షణలో డాక్టర్ మృదుల, డాక్టర్ సురేష్, డాక్టర్ శశిభూషన్ నేతృత్వంలో సిజేరియన్ ఆపరేషన్ ను విజయంతంగా నిర్వహించి పండంటి మగబిడ్డకు జన్మను ప్రసాదించారు. ప్రస్తుతం తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇటువంటి అరుదైన ఆపరేషన్ చేయటం ఇది రెండవసారని డాక్టర్ కృష్ణకాంత్ తెలిపారు.గతంలో విజయవాడ కు చెందిన గర్భిణి స్త్రీకి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ కోసం ప్రజలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్,చెన్నై వంటి నగరాలకు వెళ్ళేపని లేకుండా తమ హాస్పిటల్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇటువంటి అరుదైన చికిత్స పొందిన తల్లిబిడ్డలను విలేకరులతో మాట్లాడించారు.